తెలంగాణ

telangana

ETV Bharat / state

Pig Competitions: ఈ జాతరలో పందుల పోటీలే హైలెట్ - Pig Competitions aiza news

Pig Competitions: సాధారణంగా ఉత్సవాలు, జాతరల సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు పొట్టేళ్ల పోటీలు చూస్తుంటాం. కాని అందుకు భిన్నంగా అక్కడ పందుల పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో హాజరై వీక్షిస్తుంటారు. ఇంతకీ ఈ పోటీలు ఎక్కడంటే!

Pig
Pig

By

Published : Feb 22, 2022, 4:16 PM IST

జాతర సందర్భంగా అక్కడ పందుల పోటీలు

Pig Competitions: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో పందుల పోటీలు ఘనంగా నిర్వహించారు. శ్రీ తిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఈ సందర్భంగా నిర్వాహకులు పందుల పోటీలు ఏటా జరుపుతుంటారు. పందుల పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా... ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 25 జతల పందులు పోటీలకు వచ్చాయి.

వీటి మధ్య పోరాటాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అయిజ, పెబ్బేర్, కర్నూల్, అనంతపురం కడప, రాయచోటి, కోడుమూరు, తాడిపత్రి, రాయచూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల నుంచి పందులు పోటీకి తరలివచ్చాయి. ఈ పోటీలలో పారిపోకుండా ఎక్కువ సేపు పోరాడే పందులను నిర్వాహకులు విజేతలుగా ప్రకటిస్తారు. గెలుపొందిన పందుల యజమానులకు నగదు బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జాతర సందర్భంగా నిర్వహించిన పందుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇదీ చదవండి:బంగారు తెలంగాణ కాదు... ఇది బానిసత్వపు తెలంగాణ: షర్మిల

ABOUT THE AUTHOR

...view details