తెలంగాణ

telangana

ETV Bharat / state

'తిక్కవీరేశ్వర స్వామి ఉత్సవాల్లో ఆ పోటీలే ప్రత్యేకం' - Jogulamba Gadwal District Latest News

జాతరలు, పండుగల్లో కోడి పందేలు, ఎద్దులు బండలు లాగే పోటీలు చూసుంటాం. పొట్టెల్లా పోటీలూ నిర్వహించడం తిలకించాం. కానీ అందుకు భిన్నంగా పందులు, శునకాల పోటీలను నిర్వహించడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడాలని ఆసక్తిగా ఉందా? అయితే ఆ ఊరిపై ఓ లుక్కేయండి....

Pig and dog competitions were organized in Aiza town
ఐజ పట్టణంలో పందుల, శునకాల పోటీలు

By

Published : Mar 5, 2021, 10:34 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో జాతర సందర్భంగా పందుల (వరాహాల) పోటీలు నిర్వహించారు. ఈ పందేలు ఐజ పట్టణంలో జరిగాయి. తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు, ప్రజల వినోదం కోసం వివిధ రకాల పోటీలను నిర్వహిస్తారు. అందులో భాగంగా శుక్రవారం వరాహాల పందేలను నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

వరాహాల పోటీలతో పాటు శునకాల పరుగు పందెం నిర్వహించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 46 శునకాలు పోటీల్లో పాల్గొన్నాయి.

తిక్కవిరేశ్వర స్వామి ఉత్సవాల్లో పందుల, శునకాల పోటీలు

ఇదీ చూడండి:స్టేటస్​లో ఫొటో కూడా​ పెట్టుకోని ఆమె... వందల మందికి సెల్ఫీలిస్తోంది..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details