తెలంగాణ

telangana

ETV Bharat / state

అసౌకర్యాలకు అడ్డా... గద్వాల దవాఖానా - సౌకర్యాలు లేక గద్వాల ఆస్పత్రిలో ఇబ్బందులు

ఏళ్లు గడుస్తున్నా గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి తిప్పలు తప్పటం లేదు. కనీసం తాగునీటి సౌకర్యం లేకపోవటంతో రోగులతో పాటు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశ్రాంతి తీసుకోవటానికి, తినటానికి షెడ్లు లేకపోవటంతో... చెట్ల కింద, ఆరు బయటే కష్టాలు పడుతున్నారు.

అసౌకర్యాలకు అడ్డా... గద్వాల దవాఖానా
అసౌకర్యాలకు అడ్డా... గద్వాల దవాఖానా

By

Published : Feb 14, 2021, 10:19 AM IST

అసౌకర్యాలకు అడ్డా... గద్వాల దవాఖానా

జోగులాంబ గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 300 మంది రోగులు వస్తుంటారు. గర్భిణులు, బాలింతలతో పాటు డయాలసిస్ కేంద్రంతో కలిపి 400 వరకు చికిత్స పొందుతున్నారు. అయితే... రోగులతో పాటు వారి వెంట వచ్చే బంధువులకు కనీస తాగునీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. హోటళ్లు, ఇతర దుకాణాల్లో నీటి కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. తినటానికి ప్రత్యేక స్థలం లేకపోగా... ఆరు బయట దోమలు, ఈగల మధ్య భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చర్యలు తీసుకుంటున్నాం..

గద్వాల జిల్లా ఏర్పాటు తర్వాత ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగినా.... మౌళిక వసుతుల కల్పనకు అధికారులు ప్రయత్నించడం లేదు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన పనులకు పూర్తి స్థాయిలో మోక్షం కలగడం లేదు. ఇక వైద్యసిబ్బంది సరిపడా లేకపోవడం వల్ల మెరుగైన చికిత్స అందటం లేదని రోగులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే వారు విశ్రాంతి తీసుకోవటంతో పాటు భోజనం చేసే విధంగా....షెడ్ల నిర్మాణానికి శాశ్వత ప్రాతిపదకన చర్యలు చేపడుతున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శోభారాణి తెలిపారు. ఇప్పటికే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details