తెలంగాణ

telangana

ETV Bharat / state

'హెల్మెట్​ ధరించాలని తల్లిదండ్రులకు విద్యార్థులు చెప్పాలి'

31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా గద్వాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Parents need to tell wear to helmet at jogulamba district
'హెల్మెట్​ ధరించాలని తల్లిదండ్రులకు విద్యార్థులు చెప్పాలి'

By

Published : Feb 1, 2020, 7:10 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష జెండా ఊపి ర్యాలీని ఆరంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కేకే గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం కేకే గార్డెన్​లో సభను నిర్వహించారు.

మీ తల్లిదండ్రులు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్లే విధంగా చూడాలని విద్యార్థులకు ఎస్పీ కృష్ణ సూచించారు. ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాలను 25% తగ్గించేందుకు ఈ సంవత్సరం నుంచే కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారి పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

'హెల్మెట్​ ధరించాలని తల్లిదండ్రులకు విద్యార్థులు చెప్పాలి'

ఇదీ చూడండి :కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details