Parents and Students protest: ఇది జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలంలోని తుపత్రాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఇందులో సుమారు 190 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు తరగతి గదులు ఉన్న ఈ బడిలో పిల్లలకు బోధించేవారు మాత్రం ముగ్గురే ఉపాధ్యాయులు.. ఇందులో ఇద్దరు ఉపాధ్యాయులు నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లడంతో అందరికీ ఒక్క ఉపాధ్యాయుడే తరగతులు చెప్పాల్సి వస్తోంది. దీంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
ఉపాధ్యాయులు కావాలంటూ స్కూల్కు తాళం వేసిన తల్లిదండ్రులు - we need teachers
Parents and Students protest అదొక ప్రభుత్వ పాఠశాల, అందులో 190 మంది వరకు పిల్లలు ఉన్నారు. అందరికీ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు మాత్రం ఒక్కరే. దీంతో ఆ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పిల్లలతో కలసి బడికి తాళం వేసి ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు.
Plight of students due to lack of teachers
ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రుల ఎన్ని సార్లు పైఅధికారులకు విన్నవించుకున్న వారు పట్డించుకోలేదు. దీంతో తల్లిదండ్రుల వారిపిల్లలతో కలిసి గదులకు తాళం వేసి బడి ఆవరణలో పిల్లలతో నిరసనకు దిగారు. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలా చేయని పక్షంలో సోమవారం నుంచి నిరంతరంగా నిరసన దీక్షలు చేపడతామని విద్యార్థులు, తల్లిదండ్రులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: