తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులను లక్షాధికారులను చేయటమే నా లక్ష్యం' - 'రైతులను లక్షాధికారులను చేయటమే నా లక్ష్యం'

మట్టి గడ్డలు ఎత్తే రైతులు కార్లతో తిరగటమే తమ లక్ష్యమని జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులతో అధిక డిమాండ్​ ఉన్న పామాయిల్​ తోటలు సాగు చేపించి వాళ్లని లక్షాధికారులను చేసే బాధ్యత తీసుకుంటానన్నారు మంత్రి నిరంజన్​రెడ్డి.

PALM OIL GARDENS HORTICULTURE IN BEECHPALLI OIL FACTORY BY MINISTER NIRANJAN REDDY

By

Published : Nov 19, 2019, 10:22 AM IST

రాష్ట్రంలో కనీసం యాభై వేల ఎకరాలలో పామాయిల్ తోటలను పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్​లో పామాయిల్ మొక్కల సాగును ప్రారంభించారు. పామాయిల్ పరిశ్రమ ద్వారా బీచుపల్లి మిల్లును తిరిగి ​ప్రారంభించటమే తమ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో పామాయిల్​ పంటలపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో దాదాపు 206 మండలాలలో పామాయిల్ తోటలకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారన్నారు. ఔత్సాహిక రైతులకు అధికారులతో అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు.

'రైతులను లక్షాధికారులను చేయటమే నా లక్ష్యం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details