జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 4,423 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,460 క్యూసెక్కులుగా ఉంది. ఫలితంగా నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమాకు 623 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా జలాశయం జలకళ సంతరించుకుంది.
జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.440 మీటర్లు ఉంది. జూరాల పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.535 టీఎంసీలుగా ఉంది.