జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో 90 వేల క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో 85 వేల క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ 9.275 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 318.330 మీటర్లుగా కొనసాగుతోంది.
జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం