ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 2,577 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరింది. ఫలితంగా 1,466 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమాకు 623 క్యూసెక్కుల జలాలను వదిలారు.
జూరాలకు కొనసాగుతోన్న వరద ప్రవాహం
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉద్ధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరుతోంది. 9.657 టీఎంసీలకు గానూ.. 7.798 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జూరాలకు కొనసాగుతోన్న వరద ప్రవాహం
జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.580 మీటర్లు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.798 టీఎంసీలుగా ఉంది.