జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మానవపాడులో రెండున్నర లక్షలతో షెడ్డును నిర్మించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీఎం అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత, సర్పంచ్ గంగుల హైమావతిని ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే అబ్రహం నిర్దేశిత సమయానికి హాజరుకాగా... జడ్పీఛైర్పర్సన్ ఆలస్యంగా వచ్చారు.
ఒకే షెడ్డు... ఇద్దరు నేతలు... రెండు సార్లు ప్రారంభం - gadwal news
ప్రారంభించాల్సిన కార్యక్రమం ఒక్కటే... కానీ హాజరవ్వాల్సింది మాత్రం ఇద్దరు నేతలు. ఒకరు సమయానికి వచ్చి మరోకరు రాకపోతే పరిస్థితేంటి..? అచ్చం అలాంటి పరిస్థితే ఎదురైంది జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మానవపాడులో. ఫలితంగా... ఒకే ప్రారంభోత్సవాన్ని ఇద్దరు నేతలు.. రెండు సార్లు చేశారు.
one dump yard opened two times in manavapadu
తనకు అత్యవసర పనులు ఉన్నాయని జడ్పీ ఛైర్పర్సన్ రాకముందే షెడ్డును ప్రారంభించి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన కాసేపటికే జడ్పీ ఛైర్పర్సన్ సరిత హాజరై ఎమ్మెల్యే ప్రారంభించిన షెడ్డును మరోసారి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా... తనకు సమాచారం లేకుండా చేపట్టరాదని ఎమ్మెల్యే స్థానిక నేతలకు సూచించారు. ఇద్దరు నేతల మధ్య బేదాభిప్రాయాలు ఉంటే తమ పనులు ఎలా సాగుతాయనే చర్చ అక్కడ జరిగింది.