తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రారంభమైన చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు.. ఆందోళన ఆపని నిర్వాసితులు - Imposition of Section 144 in Chinnonipally

chinnonipalli reservior works started: సాగునీళ్లు వస్తుండటంతో.. మంచిగా పంటలు పండితే పిల్లా పాపలతో కలిసి సంతోషంగా జీవించవచ్చని ఆ గ్రామస్థులంతా భావించారు. వీరిలాగే చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కానీ అక్కడకు సాగునీళ్లు కాదు.. జలాశయం వస్తుందని తెలిసి ఆందోళన చెందారు. పచ్చని భూములు కోల్పోవడం సహా ఉన్న ఊరూను వదిలిపెట్టాల్సి రావడం వారిని కలచివేసింది. సాగునీళ్లు లేకపోయినా ఫర్వాలేదు కానీ.. ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా గ్రామాన్ని వదిలిపెట్టేది లేదని తేల్చిచెబుతున్నారు. అధికారులు వెనక్కితగ్గక పోవడంతో విధిలేక పోరాటానికి సిద్ధమయ్యారు. సర్కారు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నరగా రిలే దీక్షలు చేపట్టారు. అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.

officials started chinnonipalli reservior works in jogulamba gadwal district
ప్రారంభమైన చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు

By

Published : Mar 19, 2023, 3:04 PM IST

ప్రారంభమైన చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు

chinnonipalli reservior works started: సాగునీళ్లు వస్తే మంచిగా పంటలు బతుకుల బాగుపడతాయని ఆశపడ్డారు. అందరూ సంతోషంగా జీవించొచ్చు అని కోరుకున్నారు గద్వాల జిల్లాలోని చిన్నోనిపల్లి గ్రామస్థులు. రిజర్వాయర్ వస్తే వారికే కాదు చుట్టు పక్కల గ్రామాలకు కూడా ఎంతో బాగుంటుందని భావించారు. కానీ అది మొదటికే మోసం వచ్చింది. సాగునీళ్లు వస్తే ఉన్న ఊర్లో ఉల్లాసంగా ఉండొచ్చు అనుకుంటే తట్టా బుట్టా సర్దుకొని బతుకుజీవుడా అంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది వీరికి. సాగునీరు వద్దు, రిజర్వాయర్ వద్దు ఉన్న ఊర్లోనే బతకనివ్వండి అని గ్రామస్థులు పోరాటం చేస్తున్నారు. చివరకు అధికారులు రిజర్వాయర్ పనులు ప్రారంభించారు.

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లిలో ఉద్రిక్తతనెలకొంది. రిజర్వాయర్ వద్దంటూ 423 రోజులుగా గ్రామస్థులు చేపట్టిన రిలే దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. రాత్రి దీక్షా శిబిరం వద్దకు వచ్చిన పోలీసులు గ్రామస్థులను అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు... 144 సెక్షన్‌ విధించారు. సుమారు 20 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రామస్థులను అక్కడ నుంచి పంపింవేసిన తర్వాత అధికారులు రిజర్వాయర్‌ పనులు ప్రారంభించారు.

జోగులాంబగద్వాల జిల్లాలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. కొన్నేళ్లుగా నిలిచిన పనులు.. పోలీసు పహార మధ్య మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ రిజర్వాయర్‌ పనులను రద్దుచేయాలని గట్టు మండలంలోని చిన్నోనిపల్లి, చాగదోన, బోయలగూడెం, ఇందువాసి, లింగాపురం గ్రామాల ప్రజలు 423 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. శనివారం రాత్రి పోలీసులు దీక్ష చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండగా బందోబస్తు ఏర్పాటు చేశారు..

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా.. ఒకటిన్నర TMC సామర్థ్యంతో చిన్నోనిపల్లి వద్ద జలాశయాన్ని నిర్మిస్తున్నారు. 2007లోనే పనులకు.. శ్రీకారంచుట్టారు. ఐతే జలాశయం నిర్మాణం వల్ల చిన్నోనిపల్లి గ్రామం ముంపునకు గురవుతుండడం స్థానికులను కష్టాల్లోకి నెట్టింది. గ్రామం పూర్తిగా ముంపునకు గురి కావడమే కాక.. వ్యవసాయ భూములు కోల్పోతున్నారు. ఒక్కో ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జలాశయం వల్ల.. సర్వస్వం కోల్పోతున్నామంటూ .. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాయిపోయిన గ్రామస్థులు.. చివరకు రిలే నిరహార దీక్షలు చేపట్టారు. నిర్వాసితులకు అన్ని రకాల పరిహారం అందించేలా చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ఆర్‌ ఆండ్‌ ఆర్‌ కింద అందాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు..

చిన్నోనిపల్లితోపాటు సమీపంలోని మరో నాలుగు గ్రామాలు సైతం ముంపునకు గురి అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమకు జలాశయం వద్దని తెగేసి చెబుతున్నారు. కొన్నేళ్లుగా జలాశయం పనులు నిలిపివేసిన అధికారులు మళ్లీ మొదలుపెట్టడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు జలాశయం, పునరావాస పనులు పూర్తికాలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతుండగా సుమారు 360 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతాయని అధికారులు అంచనా వేశారు.

ఇవీ చదవండి:

మీకు ఇది తెలుసా..? TSRTC టికెట్‌తో సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం..

రాహుల్ గాంధీ ఇంటికి భారీ సంఖ్యలో పోలీసులు.. ఆ వివరాల కోసమే!

ABOUT THE AUTHOR

...view details