జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం హుండి లెక్కింపు కార్యక్రమం జరిగింది. తుంగభద్ర పుష్కరాలు ముగియడంతో సహయ కమిషనర్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. 23 రోజుల్లో రూ.83లక్షల 883 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
జోగులాంబ ఆలయ హుండి ఆదాయం రూ.83లక్షలు - అమ్మవారి హుండి లెక్కింపు కార్యక్రమం
తుంగభద్ర పుష్కరాలు ముగియడంతో అలంపూర్‌లోని శ్రీజోగులాంబ అమ్మవారి హుండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. పుష్కరాలతో కలిపి మొత్తం రూ.83,00,833 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
జోగులాంబ అమ్మవారి ఆలయ హుండిని లెక్కించిన అధికారులు
తుంగభద్ర పుష్కరాల్లో కేవలం 12 రోజుల్లోనే రూ.50 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. పుష్కరాలతో పాటు మిగతా రోజుల్లో వచ్చిన హుండి ఆదాయం కలిపి మొత్తం లెక్కించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వి.ప్రేమ్‌కుమార్, ఆలయ ఛైర్మన్ ఈ.రవిప్రకాశ్ గౌడ్, ధర్మకర్తలు, బ్యాంకు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.