జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గద్వాల డీఎస్పీ యాదగిరి, ఆర్డీఓ రాములు పరిశీలించారు. పాతపద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సబ్‌రిజిస్ట్రార్‌కు సూచించారు.
'ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు అప్రూవ్ డాక్యుమెంట్ తప్పనిసరి' - non-agricultural registrations in gadwal district
రాష్ట్రంలో పాతపద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కొనసాగించాలన్న ప్రభుత్వం ఉత్తర్వులతో సంతోషించిన రియల్టర్లు, కొనుగోలు, అమ్మకందార్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లిన తర్వాత ఖంగుతిన్నారు. ఎల్పీ లేఅవుట్లతో పాటు అప్రూవ్ డాక్యుమెంట్ తప్పకుండా ఉండాలనే నిబంధనతో పని కాకుండానే ఇంటికి పయనమయ్యారు.
పాతపద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్
నిబంధనల సడలింపుతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయని భావించిన రియల్టర్లు, కొనుగోలు, అమ్మకందార్లకు చుక్కెదురైంది. కార్యాలయానికి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కోసం తరలివచ్చిన వారు.. ఎల్పీ లేఅవుట్లతో పాటు అప్రూవ్ డాక్యుమెంట్ తప్పని సరి అని అధికారులు చెప్పడం వల్ల గందరగోళానికి గురయ్యారు. చేసేదేం లేక వచ్చినవారు వచ్చినట్టే ఇంటి బాట పట్టారు.