భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం.. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేత - కృష్ణా నదికి వరద

07:50 October 16
భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం.. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేత
భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తింది. జూరాల జలాశయం నిండుకుండలా మారింది. ఇన్‌ఫ్లో 7లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల తీర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలిని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సర్పంచులు, వీఆర్వో, వీఆర్‌ఏలు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.
ఇవీ చూడండి:ఆక్రమణలు, నిర్లక్ష్యమే... వరద ముంపునకు కారణం