గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహం తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం రాజశ్రీ గార్లపాడు, బుడ్డారెడ్డి పల్లి గ్రామాల్లో రూ.16 లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ భవనాలను జడ్పీ ఛైర్మన్ సరితతో కలిసి ఆయన ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధే సీఎం లక్ష్యం : ఎమ్మెల్యే అబ్రహం - నూతన పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం
రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహం అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం రాజశ్రీ గార్లపాడు, బుడ్డారెడ్డి పల్లి గ్రామాల్లో నిర్మించిన నూతన పంచాయతీ భవనాలను జడ్పీ ఛైర్మన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే , జడ్పీ ఛైర్మన్
సీఎం కృషితోనే గ్రామాలు అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్నాయని జడ్పీ ఛైర్మన్ సరిత పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు ప్రజలు కలిసి కట్టుగా అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. రెండు గ్రామాల ప్రజలు తమకు రోడ్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే రహదారులు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.