జోగులంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం చిన్నోనిపల్లి ముంపు గ్రామం. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయంలో గ్రామం ముంపునకు గురవుతుండడం గ్రామస్థులను కష్టాల్లోకి నెట్టింది. గ్రామం పూర్తిగా ముంపునకు గురి కావడం వల్ల అక్కడ కొత్తగా ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాలకు సుమారు 20 ఇల్లు కూలిపోయాయి.
ఒక్కో ఇంట్లో...
ఒక్కో ఇంట్లో రెండు మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్థులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నోనిపల్లి గ్రామ శివారులో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.5 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం నిర్మిస్తున్నారు. 2007లోనే పనులకు శ్రీకారం చుట్టినా... నేటి వరకు జలాశయం, పునరావాస పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. సుమారు 360 కుటుంబాలు నిర్వాసితులుగా మారినట్లు తెలుస్తోంది
వసతుల లేమి...