జోగులాంబ గద్వాల జిల్లా లో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాలు చివరిరోజు కావడంతో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి శ్రీరాములు పాల్గొన్నారు. కుటుంబసమేతంగా ఆలయ సమీపంలోని పుష్కరఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించారు.
కుటుంబసమేతంగా పుష్కరాల్లో పాల్గొన్న నాగర్కర్నూల్ ఎంపీ - జోగులాంబ గద్వాల జిల్లా తుంగభద్ర పుష్కరాల్లో ఎంపీ రాములు
తుంగభద్ర పుష్కరాలు చివరిరోజు కావడంతో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఆలంపూర్ పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రంతో ఎంపీని సత్కరించారు.
కుటుంబసమేతంగా పుష్కరాల్లో పాల్గొన్న నాగర్కర్నూల్ ఎంపీ
అనంతరం ఆలయంలోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎంపీని శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, దేవాలయ ఛైర్మన్ రవిప్రకాశ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.