జోగులాంబ గద్వాల జిల్లాలో 1,000 పైగానే ఆటోలుంటాయి. నిత్యం అవసరాల నిమిత్తం ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణిస్తుంటారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది ఆటో డ్రైవర్ల వల్ల ప్రయాణికులకు ఏర్పడిన ఇబ్బందులు ఎక్కడా పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్... గత నెల 20న ప్రయాణికుల భద్రత కోసం 'మై ఆటో ఈజ్ సేఫ్' పేరిట క్యూఆర్ కోడ్ రూపొందించారు. ప్రతి ఆటోకు క్యూఆర్ స్టిక్కర్ వేయించేలా చర్యలు తీసుకున్నారు.
క్యూఆర్ కోడ్...
ఆటో డ్రైవర్ ప్రవర్తన బాగుంది. మేము ఆటోలో సురక్షితంగా ప్రయాణిస్తున్నామన్న నమ్మకం కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆటోలో ఎక్కే ప్రయాణికులు తమ వద్ద స్మార్ట్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. చేసిన వెంటనే jgd.safe.gadi.com అనే ఆప్షన్ వస్తుంది. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఆటోలో ప్రయాణం ఎలా సాగుతుందో వివరాలు చూపుతుంది. తమ ప్రయాణ అనుభూతి అంశాలు అందులో క్లిక్ చేయాలి.
ఇలా చేయడం వల్ల తమ ప్రయాణ వివరాలు... అన్నీ పోలీసు యంత్రాగానికి సాంకేతిక ఆధారంగా తెలిసిపోతాయి. సురక్షితంగా ప్రయాణికుల ప్రయాణం సాగుతుందా? లేదా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా? అన్న నిశిత పరిశీలన ఎప్పటికప్పుడు పోలీసులు చేస్తుంటారు. తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
క్యూఆర్ కోడ్ ప్రయోజనాలు...