Response to Etv Bharat Story: ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. బహిర్భూమి కష్టాలు పేరుతో ఈటీవీ తెలంగాణలో, మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు పేరుతో ఈటీవీ భారత్లో ప్రసారమైంది.
Response to Etv Bharat Story: 'బహిర్భూమి కష్టాలు' కథనంతో.. లభించిన పరిష్కారం - అలంపూర్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ఏర్పాట్లు
బహిర్భూమి కష్టాలు పేరుతో ఈటీవీ తెలంగాణలో, "మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు" పేరుతో ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనానికి.... అధికారుల నుంచి స్పందన వచ్చింది (Response to Etv Bharat Story). అలంపూర్ ఐదోవార్డు సంతమార్కెట్ వీధిలో స్థానికులు బహిర్భూమి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని.... ఈటీవీ, ఈటీవీ భారత్లో కథనం ప్రసారమైంది. ఈ వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు... మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించారు.
toilet response
ఈ కథనంపై స్పందించిన జోగులాంబ గద్వాల జిల్లా ఉన్నతాధికారులు... అలంపూర్ మున్సిపల్ కమిషనర్రు వివరణ కోరారు. వారి ఆదేశాలతో కమిషనర్ నిత్యానంద, పురపాలక ఛైర్పర్సన్ మనోరమ, సిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించారు. వెంటనే నిర్మాణం చేపట్టేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... చూస్తామని అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం:Toilet Problems: మంటగలుస్తున్న మహిళల ఆత్మగౌరవం... శౌచాలయాల్లేక ఇబ్బందులు