జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు అధికారులు. పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. అలంపూర్ పురపాలికలో 18 పోలింగ్ కేంద్రాలు, వడ్డేపల్లి మున్సిపాలిటీలో 20 పోలింగ్ కేంద్రాలు, ఐజ మున్సిపాలిటీలో 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు పురపాలికల పరిధిలో 413 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈ పరిధిలో 37 వేల 6వందల 39 మంది ఓటర్లు ఉన్నారు.
సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ - మున్సిపల్ ఎన్నికలు
రేపు జరగబోయే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మున్సిపల్ ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. మూడు పురపాలికల్లో మొత్తం 37 వేల 6 వందల 39 మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ