జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ పంజాగుట్టలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం తొలగింపునకు నిరసనగా గద్వాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తొలగించిన అంబేడ్కర్ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడం సరికాదని వాపోయారు.
గద్వాల కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ ఆందోళన - gadwal
పంజాగుట్టలో తొలగించిన అంబేడ్కర్ విగ్రహం స్థానంలో కాంస్య ప్రతిమను పెట్టాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఎమ్మార్పీఎస్ ఆందోళన