తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల అలసత్వం... ప్రయాణికులకు ప్రాణ సంకటం - జోగులాంబ గద్వాల వార్తలు

వరద ఉద్ధృతి తగ్గినా... కొట్టుకుపోయిన రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్​ వద్ద వాగు ఉప్పొంగి కోతకు గురైన రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల అలసత్వం... ప్రయాణికులకు ప్రాణ సంకటం
అధికారుల అలసత్వం... ప్రయాణికులకు ప్రాణ సంకటం

By

Published : Sep 20, 2020, 6:30 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో కురిసిన వర్షాలకు ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్దనున్న వాగు ఉప్పొంగి అంతర్రాష్ట్ర రహదారి కోతకు గురైంది. వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై బొంకూర్ వద్ద వంతెన నిర్మాణంలో ఉండడం వల్ల తాత్కాలికంగా మట్టిరోడ్డు వేశారు. వాగు ఉద్ధృతికి మట్టికట్ట కోతకు గురైంది.

కొన్ని రోజులుగా మట్టి రోడ్డుపై వరద ఉద్ధృతి తగ్గినా మరమ్మతులు చేపట్టలేదు. నిత్యం రద్దీగా ఉండే రహదారిలో పనులు చేపట్టకపోవడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మించకపోవడం వల్ల ఐజ రాయచూరు వెళ్లే వాహనాలు మానవపాడు మీదుగా మళ్లించారు. రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతు పనులు చేయిస్తామని ఆర్డీవో తెలిపారు.

ఇదీ చూడండి:అక్టోబర్​ 1 నుంచి ఆటోల బంద్​: తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస

ABOUT THE AUTHOR

...view details