తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రిలీఫ్​ ఫండ్​కు మాంటిస్సోరి స్కూల్ విరాళం - coronavirus in india live

లాక్​డౌన్​ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి అలంపూర్​ పట్టణంలోని మాంటిస్సోరి రెసిడెన్షియల్ పాఠశాల తన వంతు సాయం చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.5 లక్షలు చెక్కును ఎమ్మెల్యే అబ్రంహంకు పాఠశాల డైరెక్టర్​ రవిప్రకాష్​ అందజేశారు.

Montessori School Donation to CM Relief Fund
సీఎం రిలీఫ్​ ఫండ్​కు మాంటిస్సోరి స్కూల్ విరాళం

By

Published : Apr 9, 2020, 4:04 AM IST

కరోనా వ్యాప్తితో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రజలకు, ప్రభుత్వానికి గద్వాల జిల్లా అలంపూర్​లోని మాంటిస్సోరి స్కూల్​ తనవంతు సాయం చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి పాఠశాల డైరెక్టర్​ రవిప్రకాష్​ రూ.5లక్షలు అందజేశారు. అలంపూర్​లోని మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, ఆస్పత్రి కార్మికులకు గ్రీన్ బాస్కెట్ పేరుతో నిత్యావసర సరకులు అందించారు.

స్కూలు యాజమాన్యంతో పాటు పాఠశాలలో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు తమ వంతుగా రూ.50వేలు విరాళం అందించారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహంకు చేతుల మీదుగా విరాళం అందజేశారు. కష్టసమయంలో తమ వంతు సాయం చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు.

ఇదీ చదవండి:కరోనా కట్టడిలో 'కేరళ మోడల్​' సూపర్ ​హిట్​!

ABOUT THE AUTHOR

...view details