తెలంగాణ

telangana

ETV Bharat / state

డిజిటల్​ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే కృష్ణమోహన్​ రెడ్డి

గద్వాల జిల్లా చింతల్​పేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో డిజిటల్​ గద్వాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్​ రెడ్డి​ ప్రారంభించారు. 150 మంది సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు 8, 9 తరగతి విద్యార్థులకు కంప్యూటర్​పై శిక్షణ ఇవ్వనున్నారు. కలెక్టర్​ శశాంక్​ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.

డిజిటల్​ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Jun 29, 2019, 3:33 PM IST

డిజిటల్​ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా చింతల్​పేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిజిటల్ గద్వాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి ​ ప్రారంభించారు. దాదాపు 150 మంది సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్​పై శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్​ తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారిచే రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయన్నారు. 1250 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 90 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశాంక్​ పేర్కొన్నారు. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు శిక్షణ ఇచ్చేందుకు గద్వాల జిల్లాకు రావడంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్​ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గద్వాల చాలా వెనుకబడిన జిల్లా అని.. కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details