కర్ణాటక ప్రభుత్వం కృష్ణా పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చాలని చూస్తోందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆర్డీఎస్ దగ్గర కుడి భాగంలో కాల్వలు తవ్వి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. దీనిద్వారా ఆర్డీఎస్ క్రింద 80వేల ఎకరాల ఆయకట్టును ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
'కర్ణాటక చర్యలతో ఎడారిగా ఉమ్మడి పాలమూరు జిల్లా' - mla krishna mohan reddy about krishna water evacuation
ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణకు కర్ణాటక వల్ల మరోసారి అన్యాయం జరుగుతోందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. కర్ణాటక.. కృష్ణా నది నుంచి అక్రమంగా నీటిని తరలిస్తోందని.. దీనివల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గద్వాల ఎమ్మెల్యే, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కృష్ణా నీటి వివాదం
కర్ణాటక గంజిపల్లి దగ్గర 0.2 టీఎంసీల ప్రాజెక్టు చేపట్టడానికి ఆ సర్కార్ రూ.192 కోట్లతో పంపు నిర్మాణం కోసం టెండర్లు పిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్.. ఇటు ఏపీ, అటు కర్ణాటక రాష్ట్రాలతో సానుకూలంగా ఉంటూ సాగునీరందిస్తుంటే.. కర్ణాటక మాత్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
- ఇదీ చదవండి :దొంగలు బాబోయ్.. దొంగలు!