సీఎం కేసీఆర్ నిరంతర శ్రమతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఉండటం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని కొవిడ్ వార్డును మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయంతో 60 పడకలు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు.
గద్వాల ఆస్పత్రిలో కొవిడ్ వార్డును సందర్శించిన ఎమ్మెల్యే - mla bandla krishna mohan reddy visited covid ward in gadwal hospital
జోగులాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గద్వాల ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
ఏపీకి చెందిన కరోనా బాధితులు కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు ఏ సమస్య రాకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.