జోగులాంబ గద్వాల జిల్లాలోని నల్లగుంట సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తరలించారు. ఈ ఏర్పాట్లను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శృతితో కలిసి పరిశీలించారు.
'ఈ సమయంలో సామాజిక దూరమే శ్రీరామ రక్ష' - ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో నల్గగుంటలోని కూరగాయల మార్కెట్‌ను వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు.
'ఈ సమయంలో సామాజిక దూరమే శ్రీరామ రక్ష'
మార్కెట్‌కు వచ్చే వారు సామాజిక దూరాన్ని పాటించాలని... గుంపులుగా వెళ్లకూడదని ఎమ్మెల్యే సూచించారు. కరోనా వ్యాధి రాష్ట్రంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ముందస్తు నిల్వలు..పెరిగిన కొనుగోళ్లు