రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన రెడ్డి పాల్గొని.. స్వయంగా ట్రాక్టర్ నడిపారు. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.
కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు: ఎమ్మెల్యే - new revenue act-2020
కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ తీసిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు.
కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు: ఎమ్మెల్యే
రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీ ధరూర్ స్టేజి నుంచి వైఎస్సార్ చౌక్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.