తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే నిత్యాన్నదానం - గద్వాల శాసన సభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజా వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న రోగులకు, సహాయకులకు ప్రతిరోజూ భోజనాన్ని అందజేస్తున్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

mla distributed food for patients
ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే నిత్యాన్నదానం

By

Published : May 17, 2021, 7:07 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు, ఇతరులకు ఆహారాన్ని అందజేశారు గద్వాల శాసన సభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. లాక్​డౌన్ విధించడం వల్ల ఆసుపత్రిలోని రోగులకు భోజనం తీసుకువచ్చే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని అందుకే తానే భోజనం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అలాగే కరోనా రోగుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు తానే స్వయంగా వచ్చి భోజనాలు పెడ్తూ.. నాలుగు మాటలు మాట్లాడుతున్నట్లు తెలిపారు. లాక్​డౌన్ ఉన్నన్ని రోజులు ఈ నిత్యాన్నదాన ప్రక్రియ కొనసాగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన రెడ్డి తెలిపారు.

రోగులకు అందాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాలని జిల్లా సూపరింటెండెంట్ అధికారి చంద్ నాయక్​కు సూచించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కరోనా కాలంలో ఆకలితో అలమటిస్తున్న వారికి భోజన సదుపాయం కల్పించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.​కేశవ్, జడ్పీటీసీ రాజశేఖర్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి;రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details