తెలంగాణ

telangana

ETV Bharat / state

'టోకెన్లు జారీ చేసిన తేదిన మాత్రమే పత్తిని తీసుకురావాలి' - గద్వాల తాజా వార్తలు

గద్వాలలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డితో కలిసి జిల్లా పరిషత్​ ఛైర్మన్​ కె. సరిత ప్రారంభించారు. సీసీఐ నియమానుసారం పత్తిని బాగా ఆరబెట్టి తక్కువ తేమతో తీసుకెళ్లి మంచి మద్దతు ధరను పొందాల్సిందిగా సరిత సూచించారు.

mla and zp chairmen started cci center in gadwal
mla and zp chairmen started cci center in gadwal

By

Published : Nov 10, 2020, 4:11 PM IST

వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేసిన తేదిన మాత్రమే పత్తిని మార్కెటుకు తీసుకురావాలని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్​ ఛైర్మన్​ కె. సరిత రైతులకు సూచించారు. గద్వాలలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డితో కలిసి ప్రారంభించారు.

సీసీఐ నియమానుసారం పత్తిని బాగా ఆరబెట్టి తక్కువ తేమతో తీసుకెళ్లి మంచి మద్దతు ధరను పొందాల్సిందిగా సరిత సూచించారు. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సీసీఐ సంస్థపై ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ తెలియజేశారు. కొంతవరకు రంగుమారిన పత్తిని సైతం కొనుగోలు చేయాల్సిందిగా కోరారు.

ఇదీ చూడండి: దుబ్బాకలో 21 రౌండ్లు పూర్తి.. 620 ఓట్ల ఆధిక్యంలో భాజపా

ABOUT THE AUTHOR

...view details