జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీపీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రెండో విడత పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే, ఎంపీపీలు - తెలంగాణ వార్తలు
గద్వాల మండలం పూడూరు గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఎంపీపీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రెండో విడత పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే, ఎంపీపీలు
గ్రామంలో మొదటి విడతలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, పెండింగ్లో ఉన్న పనులను రెండో విడతలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సమస్యలు అందరూ కలిసికట్టుగా పరిష్కరించుకునే విధంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రోడ్లు, వైకుంఠ దామాల స్థలం విషయంలో వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
ఇదీ చూడండి : పంటను కొనుగోలు చేయాలని రోడ్డుపై ఎమ్మెల్యే నిరసన