జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.అబ్రహం పరిశీలించారు. అలంపూర్ చౌరస్తాలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లుకు వెళ్లిన ఆయన పత్తి కోనుగోళ్లు ఎందుకు నిలిచి పోయాయి, అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటూ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పుష్పమ్మతో ఫోన్లో మాట్లాడారు.
పత్తికొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - పత్తికొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అబ్రహం
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లును ఎమ్మెల్యే అబ్రహం పరిశీలించారు.
పత్తికొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ సిస్టమ్ ద్వారా పత్తి కొనుగోళ్లు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా మొత్తం పత్తిని కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే అబ్రహం సూచించారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు తృప్తిగా పనిచేయడం లేదు'