జోగులాంబ గద్వాల జిల్లా ఐజా తహసీల్దార్ కార్యాలయంలో అలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించి.. సేవలకు శ్రీకారం చుట్టారు.
రెవెన్యూ విధానంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ధరణికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు వెంటనే పూర్తయ్యేలా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నీ తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగేలా ధరణి పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.