జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... ఉండవల్లి, అలంపూర్, వడ్డేపల్లి, ఐజ ఇటిక్యాల, మానవపాడు మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.10,88,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అబ్రహం పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - తెలంగాణ తాజా వార్తలు
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. గద్వాల జిల్లా అలంపూర్లో పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
![సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8787460-2-8787460-1599998135799.jpg)
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి చెక్కులు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చూడండి:పార్కింగ్ స్థలం ఎక్కడుందో.. చెప్పేసే యాప్ వచ్చేసింది!
Last Updated : Sep 13, 2020, 10:03 PM IST