తెలంగాణ

telangana

ETV Bharat / state

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, వాణీదేవి - జోగులాంబ గద్వాల్ జిల్లా వార్తలు

ఐదో శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారిని మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి దర్శించుకున్నారు. ముందుగా బాల బ్రాహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Ministers vemula prashanth reddy, srinivasa goud and surabhi vani visited the Jogulamba temple
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

By

Published : Mar 2, 2021, 12:39 PM IST

అలంపూర్ జోగులాంబ అమ్మవారిని, బాల బ్రాహ్మేశ్వర స్వామి వార్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్​లో పర్యటించారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు.

ముందుగా స్వామి వారిని దర్శించుకుని అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ప్రాచీన ఆలయాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని సురభి వాణీదేవి అన్నారు. గెలిచిన తరువాత మరోసారి ఆలయాలను సందర్శిస్తానని తెలిపారు. వారివెంట ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్ సరిత ఉన్నారు.

ఇదీ చూడండి: కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై ఈటల ప్రశంసల జల్లు

ABOUT THE AUTHOR

...view details