జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శక్తి పీఠాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. వారు తొలుత బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.
జోగులాంబలో మంత్రుల ప్రత్యేక పూజలు... పుష్కరాలపై సమీక్ష - జోగులాంబ గద్వాల జిల్లా తాజా అప్డేట్స్
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ఐదో శక్తిపీఠాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు దర్శించుకున్నారు. మొదటగా బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అమ్మవారికి పూజలు జరిపారు. తుంగభద్ర పుష్కరాలపై ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.
జోగులాంబలో మంత్రుల ప్రత్యేక పూజలు... పుష్కరాలపై సమీక్ష
తుంగభద్రా నదికి నవంబర్ 20 నుంచి పుష్కరాలు రానున్నందున అధికారులతో చర్చించనున్నారు. పుష్కరాల నిర్వహణ సహా ఆలయ అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులు, దేవాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:దిల్లీలో అంతకంతకూ క్షీణిస్తున్న వాయు నాణ్యత