జోగులాంబ గద్వాల జిల్లాలోని థరూర్ మండలం గూడెం దొడ్డి గ్రామం సమీపంలో ఉన్న నెట్టెంపాడు ఫేస్ 1 ఎత్తిపోతల పథకం వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ మోటర్లకు పూజలు చేసి ప్రారంభించారు. జూరాల నీటి ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అదే విధంగా త్వరలో పాలమూరు రంగారెడ్డి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. నెట్టెంపాడు పథకం కింద సుమారు 11 టీఎంసీల నీటిని ఎత్తి పోసుకునే విధంగా సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు.
నెట్టెంపాడు నీరు పారితే.. వలసలుండవు
జూరాలకు వస్తున్న వరద నీటితో ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నెట్టెంపాడు ఫేస్ 1 ఎత్తిపోతల పథకం వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ మోటర్లకు పూజలు చేసి ప్రారంభించారు.
నెట్టెంపాడు నీరు పారితే.. వలసలుండవు