కరోనా కష్టకాలంలోనూ రైతులకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం పెద్దపల్లి, కుర్తిరావుల చెరువు గ్రామాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను మంత్రి ప్రారంభించారు. మల్దకల్ మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రైతు సంబురాలను మంత్రి ప్రారంభించారు.
అభివృద్ధి చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల ఆరోపణలు: మంత్రి
జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం పెద్దపల్లి, కుర్తిరావుల చెరువు గ్రామాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. మల్దకల్ మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రైతు సంబురాలను మంత్రి ప్రారంభించారు.
minister singireddy niranjan reddy on farming in telangana
రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు లేనిపోని అబాంఢాలు మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, విత్తనాలు, ఎరువులు అందిస్తూ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.