తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఇటిక్యాల మండలం పతంగ్దొడ్డి, మానవపాడు మండలం జల్లాపురం, ఉండవెల్లి మండలం తక్కశిల, రాజోలి, కలుకుంట్లలో రైతు వేదిక భవనాలకు భూమి పూజలు చేశారు.
తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శం: మంత్రి నిరంజన్‌రెడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి నిరంజన్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో రైతు వేదిక భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అన్నదాతల అవసరాలు తీర్చే విధంగా ఈ రైతు వేదికలు ఉండనున్నాయని మంత్రి వివరించారు.
తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శం: మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతులను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2600 రైతు వేదిక భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 53 రైతు వేదికలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాతల అవసరాలు తీర్చే విధంగా ఈ రైతు వేదికలు ఉంటాయన్నారు. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు అన్ని సలహాలు, సూచనలు చేసే విధంగా ఈ వేదికలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత తదితరులు పాల్గొన్నారు.