రాష్ట్రంలో పండిన మొత్తం పత్తిని సీసీఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్ శృతి ఓజాతో కలిసి మానవపాడు మండలం నారాయణపురం, మద్దూరు, ఉండవెల్లి మండలం కలుగోట్ల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు.
'రైతు అభివృద్ధిలోకి వస్తేనే... దేశాభివృద్ధి ముందుకు సాగుతుంది' - వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్ శృతి ఓజాతో కలిసి మానవపాడు మండలం నారాయణపురం, మద్దూరు, ఉండవెల్లి మండలం కలుగోట్ల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు.
రైతులందరూ కలిసి ఒక్క చోట చేరి మాట్లాడుకోవడానికి రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. త్వరలోనే రైతు వేదికల్లో స్క్రీన్ ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నియంత్రిత సాగులో భాగంగా సుమారు 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు మంత్రి తెలిపారు. రైతు అభివృద్ధిలోకి వస్తేనే... దేశం అభివృద్ధి పథంలో ముందుంటుందన్న నినాదంతో... రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అనుసరించి మహారాష్ట్ర కూడా నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.