తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister KTR responds: 'చిన్నారి గుండె ఆపరేషన్​కు.. వైద్య సాయం అందిస్తాం' - child heart problem in kishtapur

Minister KTR responds: జోగులాంబ గద్వాల జిల్లాలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆరునెలల చిన్నారి ధీనస్థితిపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. పసికందు 'హృదయ వేదన'పై ఈనాడు- ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై స్పందించిన కేటీఆర్​.. చిన్నారికి వైద్య సాయం అందిస్తామని ట్విట్టర్​ ద్వారా తెలియజేశారు.

minister ktr responds on child operation
మంత్రి కేటీఆర్​, చిన్నారి గుండె ఆపరేషన్​

By

Published : Dec 11, 2021, 2:01 PM IST

Minister KTR responds: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఆ బాబు వైద్యానికి అవసరమయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా కేటీఆర్​ తెలియజేశారు.

కథనాలకు కేటీఆర్​ స్పందన

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన గోవర్దన్​, ప్రశాంతి దంపతుల ఆరు నెలల చిన్నారి గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీనిపై ఈ నెల 5 న ఓ చిన్నారి హృదయ వేదన శీర్షిక పేరిట ఈటీవీ భారత్​, 'చిన్ని గుండె తల్లడిల్లి' పేరుతో ఈనాడులో కథనాలు వచ్చాయి. వీటిపై స్పందించిన మంత్రి కేటీఆర్​.. చిన్నారికి వైద్య సాయం అందిస్తామని ట్వీట్​ చేశారు.

శ్వాస ఆడక చిన్నారి అవస్థలు

Minister KTR responds on child operation: కొన్ని రోజుల క్రితం.. చిన్నారికి నలతగా ఉండటంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. బాబు గుండెకు రంధ్రాలు పడ్డాయని డాక్టర్లు తెలిపారు. ఆ సమస్యతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో పడుతున్న బాధను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. వైద్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఉన్నదంతా ఊడ్చి, అప్పు చేసి బాబుకు చికిత్స అందించారు. ఎక్కడ చూపించినా ఆపరేషన్ కచ్చితంగా చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌ కోసం సుమారు రూ. ఆరు లక్షలు ఖర్చువుతుందని.. నెలలోపు ఆపరేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. దీంతో దాతలు ముందుకు వచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకున్నాడు. ఇప్పుడు ఈనాడు-ఈటీవీ భారత్ పుణ్యమా.. కేటీఆర్ స్పందనతో ఆ చిన్నారికి త్వరలోనే ఆపరేషన్ జరగనుంది.

ఇదీ చదవండి:Harish rao in Gandhi hospital : 'గాంధీ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details