తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao comments: 'రైతులపై మూగజీవాలకు ఉన్న ప్రేమ భాజపా నేతలకు లేదు' - harish rao comments on central minister

Harish rao comments: జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్​రావు.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. మంత్రులను అవమానపర్చడం అంటే తెలంగాణ రైతులు, ప్రజలను అవమానపర్చినట్టేనని మండిపడ్డారు. రైతుల పట్ల మూగజీవాలకు ఉన్న ప్రేమ భాజపా నేతలకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister harish rao comments on central government in jogulambagadwala
minister harish rao comments on central government in jogulambagadwala

By

Published : Dec 22, 2021, 8:26 PM IST

'రైతులపై మూగజీవాలకు ఉన్న ప్రేమ భాజపా నేతలకు లేదు'

Harish rao comments: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్​రావు.. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల, 300 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. మల్దకల్ మండల కేంద్రంలో కేసీఆర్ అన్నదాన క్యాంటీన్​తో పాటు.. ఆత్మీయ సంబురాల సభలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన మంత్రి హరీశ్ ​రావు.. తెలంగాణ మంత్రులకు పనిలేదా అంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకుని చెంపలేసుకున్న భాజపా సర్కారు.. ధాన్యం కొనుగోలు విషయంలోనూ దిగి వచ్చే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

రైతులను అవమానపర్చినట్టే..

"రైతుల వడ్లు వద్దన్న భాజపా కూడా తెలంగాణ ప్రజలకు వద్దు. భాజపాను గద్దెదించితేనే కేంద్రంలో వడ్లు కొనే ప్రభుత్వం వస్తుంది. అందుకు తెలంగాణ నడుంబిగిస్తుంది. మంత్రులను అవమానపర్చడం అంటే తెలంగాణ రైతులు, ప్రజలను అవమానపర్చినట్టే. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయకపోతే ఎందుకని ప్రశ్నిస్తే తప్పా..? రైతుల పట్ల మూగజీవాలకు ఉన్న ప్రేమ భాజపా నేతలకు లేకుండా పోయింది. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలు వడ్లు కొనాలని ఎందుకు అడగటం లేదు..? ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్పాలి." - హరీశ్​రావు, మంత్రి

భాజపా కార్యకర్తల అడ్డగింత..

నర్సింగ్​ కళాశాలకు శంకుస్థాపనకు వచ్చిన మంత్రి హరీశ్​ను భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లో నర్సింగ్ కళాశాల నిర్మాణం చేపట్టవద్దంటూ భాజపా కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరై ఆందోళన చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఆందోళనలో భాజపా నేత డీకే అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్​ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని స్నిగ్ధారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details