తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడికొండ గుహ.. రాతిచిత్రాలు ఆహా! - Jogulamba Gadwala District latest newsNews

మధ్యరాతి యుగానికి చెందిన రాతిచిత్రాలను ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ జోగులాంబ గద్వాల జిల్లా గుర్తించింది. పదివేల ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్నామని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రాతిచిత్రాలు
రాతిచిత్రాలు

By

Published : Jul 3, 2021, 10:30 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా మేడికొండ గ్రామ శివారులోని కొండగుహలో రాతిచిత్రాలను ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ గుర్తించింది. రాయిపై చిత్రించిన శైలినిబట్టి చూస్తే ఆ రాతిచిత్రాలు మధ్యరాతి యుగానికి చెందినవని.. పదివేల ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్నామని ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మేడికొండ గుహలో వెలుగుచూసిన దుప్పి, వేటాడుతున్న పెద్దపులి, అడవిపంది, మనుషుల రాతిచిత్రాలు అపూర్వమైనవిగా తెలిపారు. బృందం సభ్యుడు హనుమన్నగారి వేమారెడ్డి, మిత్రులు పద్మారెడ్డి, హన్మంత్‌రెడ్డిలతో కలిసి తాజా రాతిచిత్రాల్ని గుర్తించినట్లు హరగోపాల్‌ పేర్కొన్నారు. శైలిని బట్టి ఇది కొత్తరాతి యుగానికి ముందటి రాతిచిత్రంగా చెప్పొచ్చు అన్నారు.

ఇదీ చదవండి:Sirisha Bandla: అంతరిక్షంలో తెలుగమ్మాయి తొలి అడుగు!

ABOUT THE AUTHOR

...view details