తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన - red crass

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో నిర్వహించిన వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కిమ్స్​, రెయిన్​బో ఆసుపత్రి వైద్యులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేశారు.

గద్వాలలో ఉచిత వైద్య శిబిరం

By

Published : Mar 31, 2019, 4:56 PM IST

గద్వాలలో ఉచిత వైద్య శిబిరం
గద్వాల జిల్లా అలంపూర్​లో నిర్వహించిన వైద్య శిబిరానికి భారీ సంఖ్యలో రోగులు తరలివచ్చారు. స్థానిక విశ్వశాంతి జూనియర్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పవర్ గ్రిడ్ ఇండియన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

కిమ్స్, రెయిన్​బో వైద్యులు పాల్గొని సేవలందించారు. నరాలు, కండరాలు, దంతాలు, గుండె, చిన్నపిల్లల అనారోగ్య సమస్యలకు సంబంధించి స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొన్నారు.

అరకొర వసతులతో ఇక్కట్లు

వైద్య శిబిరంపై విస్తృతంగా ప్రచారం చేశారు. సమీప మండలాల నుంచి అధిక సంఖ్యలో రోగులు హాజరయ్యారు. ఉదయం ఏర్పాటు కావాల్సిన వైద్య శిబిరం ఆలస్యమైంది. వైద్య సహాయం కోసం వచ్చే వారికి సరైన వసతులు కల్పించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణి చేశారు.

ఇదీ చదవండి:డీవీటీపై నిర్లక్ష్యం మరణానికి కారణం కావొచ్చు..!

ABOUT THE AUTHOR

...view details