తెలంగాణ

telangana

ETV Bharat / state

సురవరం సుధాకర్ రెడ్డికి మందకృష్ణ మాదిగ పరామర్శ - cpi national secretary suravaram sudhakar reddy

జోగులాంబ గద్వాల జిల్లాలోని​ స్వగ్రామంలో ఉన్న సురవరం సుధాకర్​ రెడ్డిని మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనారోగ్య కారణాల వల్ల తన స్వగ్రామమైన ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో సురవరం విశ్రాంతి తీసుకుంటున్నారు.

manda krishna visitated suravaram sudhakar reddymanda krishna visitated suravaram sudhakar reddy
సురవరం సుధాకర్ రెడ్డికి మందకృష్ణ మాదిగ పరామర్శసురవరం సుధాకర్ రెడ్డికి మందకృష్ణ మాదిగ పరామర్శ

By

Published : Oct 4, 2020, 3:27 PM IST

అనారోగ్యం కారణంగా.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సుధాకర్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై కొద్దిసేపు వారిరువురు చర్చించారు.

ఎస్సీ వర్గీకరణం కోసం దిల్లీ వెళ్లిన ప్రతిసారి సురవరం సుధాకర్ రెడ్డిని కలిసేవాళ్లమని మందకృష్ణ తెలిపారు. కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఎస్సీలకు నమ్మకద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమిని ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రైతు వేదికల పేరుతో బలహీన వర్గాల పేదల భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details