జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పురపాలక పరిధిలోని లార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు అవగాహన కల్పించారు. లార్డ్ స్వచ్ఛంద సంస్థ, ఆశావర్కర్లు, కౌన్సిలర్లు వార్డుల్లో తిరుగుతూ వైరస్‌పై ప్రజలందరికీ అర్ధమయ్యేలా నివారణ చర్యలు వివరించారు.
లార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన - అవగాహన కార్యక్రమం
కరోనా వైరస్‌ను నివారించేందుకు లార్డ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గద్వాల పురపాలక పరిధిలోని ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. వార్డు కౌన్సిలర్లు, ఆశావర్కర్లు అంతా కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.

లార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన
ఎవరైనా దగ్గు, తుమ్ములు, శ్వాసకోశ ఇబ్బందులు పడుతూ ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ ప్రమాదకర వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని కోరారు.
లార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన
ఇవీ చూడండి:కరోనా @110: భారత్‌ను కలవరపెడుతోన్న కొవిడ్-19 కేసులు