జోగులాంబ గద్వాల జిల్లాలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వ్యాపారస్తులు వారి దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం 10 గంటల నుంచి పోలీసులు ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని కోరారు.
అవసరముంటేనే బయటకు రండి: ఎస్పీ రంజాన్ రతన్ - తెలంగాణలో లాక్డౌన్
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ కుమార్. ఉదయం 10 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
lock down in jogulamba gadwala district
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎస్పీ రంజాన్ రతన్ కుమార్ పర్యటించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఏదైనా అవసరం ఉంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య బయటకు రావొచ్చని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీతోపాటు డీఎస్పీ యాదయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ జక్కుల హనుమంతు ఉన్నారు.
ఇదీ చదవండి:'ప్రజలు సహకరించాలి... లేకుంటే కఠిన చర్యలు తప్పవు'