తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంపూర్​లో కర్నూల్​ వ్యక్తి ఆత్మహత్య - జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో కర్నూల్​ వ్యక్తి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణ కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

kurnool man suicide in alampur
అలంపూర్​లో కర్నూల్​ వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jul 26, 2020, 3:47 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణ కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూల్ జిల్లా కేంద్రంలోని కుమ్మరి వీధికి చెందిన కె. రఘురాం అనే వ్యక్తి అలంపూర్ పట్టణంలోని హరిత హోటల్ సమీపంలో రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మూడు నెలలుగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారని అందువల్లే రఘురాం అలంపూర్ వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన్టలు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details