ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సుమారు 85 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు వచ్చిందని అధికారులు వెల్లడించారు. జూరాలకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాజెక్టును సందర్శించారు. ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. అంతకంటే ముందు కుడి కాలువకు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాగునీరు విడుదల చేశారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.6 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూరాలకు కృష్ణమ్మ వడివడి పరుగులు - జూరాల
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాజెక్టును సందర్శించి ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు.
జూరాలకు కృష్ణమ్మ వడివడి పరుగులు