తెలంగాణ

telangana

ETV Bharat / state

కస్తూర్బా కళాశాల నూతన భవనం ఆవిష్కరణ - undefined

గద్వాల మండలం గోన్పాడు గ్రామంలోని కస్తూర్బా ఇంటర్‌ విద్యాలయంలో నిర్మించిన నూతన భవనాల శంకుస్థాపన శుక్రవారం జరిగింది. శంఖుస్థాపన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్‌ సరిత, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.

కస్తూర్బా కళాశాల నూతన భవనం ఆవిష్కరణ

By

Published : Jul 13, 2019, 9:56 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం గోన్పాడు గ్రామ సమీపంలో నిర్మించిన కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం నిర్మించిన నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. సుమారు ఒక కోటి 54 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. అదేవిధంగా గద్వాల పట్టణంలోని ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. ఈ కళాశాల పురాతనమైందని... రాష్ట్రంలోనే మంచి పేరున్న ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి పేరు ప్రతిష్ఠలు సాధించారని గద్వాల శాసన సభ్యులు అన్నారు. ప్రస్తుత విద్యార్థులు కూడా మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేస్తానని విద్యార్థులు చక్కగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.

కస్తూర్బా కళాశాల నూతన భవనం ఆవిష్కరణ
ఇవీ చూడండి:పంచాయతీ రాజ్​ చట్టంపై కేసీఆర్​ దిశానిర్దేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details